Site icon Prime9

Nara Chandrababu : జనసేన చీఫ్ పవన్‌కు మద్దతుగా చంద్రబాబు.. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ !

nara chandrababu support to pawan kalyan on ycp defamantion case

nara chandrababu support to pawan kalyan on ycp defamantion case

Nara Chandrababu : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ సర్కారు పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఫైర్ అయ్యారు. కాగా ఇప్పుడు తాజాగా పవన్ కు మద్దతుగా తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. జగన్ సర్కారు.. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు పెట్టి అణిచి వేయాలనుకోవటం అవివేకమని అన్నారు.

పవన్ పై కేసు పెట్టడం బుద్దిలేని చర్య అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని బాబు అభ్యంతరం తెలిపారు. జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడాన్ని సమాజం మెత్తం ఖండించాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు చేయటం, రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టటం అనేది జగన్ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని..  ఇలాంటి అణచివేత ధోరణి ని జగన్ మానుకోవాలని హితవు పలికారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తి గత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే కేసు పెడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

 

 

వాలంటీర్ల పై అంత ప్రేమెందుకో కూడ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తి గత వివరాలు, కుటుంబ వ్యవహారాల పై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పని అన్నారు. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందుగా కేసు పెట్టి విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి, రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండని సూచించారు. ప్రశ్నించిన వారి పై అక్రమ కేసులు, వ్యక్తి గత దాడి, జగన్ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవని..  ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పవన్ కు చంద్రబాబు సపోర్ట్ గా నిలువడం జనసేన నేతలకు ప్రత్యేకంగా మారింది.

Exit mobile version