Nadendla Manohar : దమ్ముంటే నాతో చర్చకు ఏ వైకాపా మంత్రి అయినా సిద్దమా అంటూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో సమావేశం నిర్వహించారు. పాలవెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం అమూల్ డైరీ కోసమే కోసమే బటన్ నొక్కారని ఆయన ఆరోపించారు. ఆ పథకంలో వేల కోట్లు అవినీతి జరిగిందని.. ఆ డబ్బులు అన్ని ఎటుపోయాయో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం డబ్బులు నష్టం జరుగుతుంటే మీకు బాధ లేదా అంటూ వ్యాఖ్యానించారు. చర్చకు మేము సిద్దంగా ఉన్నామన్న ఆయన.. మండల, గ్రామాల, ద్వారా లిస్ట్ ఇవ్వండి.. ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్దామని, మా జనసేన శ్రేణులు కూడా వస్తారు మీలో నిజాయితీ ఉంటే రావాలని ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వం చేస్తున్న స్కాంలను ఆధారాలతో సహా బయటపెడతామని మనోహర్ వివరించారు.
Nadendla Manohar : దమ్ముంటే నాతో చర్చకు ఏ వైకాపా మంత్రి అయినా సిద్దమా అంటూ సవాల్ చేసిన నాదెండ్ల మనోహర్

nadendla manohar shocking comments on ysrcp government