Nadendla Manohar: జనం కోసం జనసేన ఆవిర్భవించిందని నాదేండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతోందని నాదేండ్ల మనోహర్ అన్నారు. ఈ మేరకు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం చెక్కులను పవన్ కళ్యాణ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. జనసేన వెంట జనం ఉండగా ఉన్నారని అన్నారు.
నవరత్నాల్లో ఇచ్చిన హామీలపై ఆయన ప్రశ్నించారు. మద్యపానం నిషేదిస్తామని విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని ఆరోపించారు.
లిక్కర్ ద్వారా ఆదాయం వస్తుందని.. వాటితో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు.
గంజాయి మత్తులో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటోందని మండిపడ్డారు.
గంజాయి నివారణకు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి ఉందని.. ఆరోపించారు. ఆర్ధిక సాయం విషయంలో కూడా అధికారులు లంచాలకు అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు.
రాష్ట్రం మెుత్తం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. వైసీపీ నేతలు పేదల రక్తాన్ని తాగుతున్నారని.. ఇలా చేస్తే వైసీపీ నేతలకు తగిన బుద్ది చెప్పాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సామాన్యూలు, మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా.. వాటిని ప్రభుత్వం ఏనాడు పట్టించుకోవడం లేదని అన్నారు.
ప్రతి వర్గాలను జగన్ సర్కార్ మోసం చేసిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తో దళితులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.
ప్రతి వర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డంగా మోసం చేస్తుందని.. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
ఏ సంక్షేమ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని అన్నారు.
యువతకు జనసేన అండగా ఉంటుందని.. రాబోయే రోజుల్లో ప్రతి విషయంలో అండగా ఉంటుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు వెళదామని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
పవన్ కళ్యాణ్ వేగాన్ని ఏ ప్రభుత్వం అడ్డుకోలేదని.. తొమ్మిదేళ్లుగా ఆయన పార్టీని ముందుకు నడిపిస్తున్నారని సభా ముఖంగా తెలిపారు.