Site icon Prime9

Mudragada Padmanabham : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం లేఖ.. ఏం రాశారంటే ???

Mudragada Padmanabham letter to janasena chief pawan kalyan

Mudragada Padmanabham letter to janasena chief pawan kalyan

Mudragada Padmanabham : ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడుక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్రలో తనదైన శైలిలో అధికార వైసీపీపై పవన్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కళ్యాణ్ కి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలో ఎమ్మెల్యేను తిట్టడానికి మీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని.. పవన్ కి సూచించారు.

అదే విధంగా ఈ లేఖతో పవన్‌కు కోపం రావచ్చని.. ఆయన కోట్లాది మంది అభిమానులకు అయితే నన్ను తుది ముట్టించాలనే ప్రయత్నం చేయవచ్చని కూడా పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే తాను లేఖ రాస్తున్నట్టుగా చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మకం నుంచి కాపాడటం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంటు వగైరా సమస్యల గురించి మాట్లాడాలని కోరారు. 2019 ఎన్నికల ముందు పవన్ తన వద్దకు పంపించిన రాయబారులకు సలహా ఇచ్చి పంపించానని.. కానీ ఆ సలహాలు అడిగి గాలికి వదిలేసారని విమర్శించారు. నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వాటిపై యుద్దం చేయాలని పవన్‌ను లేఖలో కోరారు. పార్టీకి అధినేతగా ఉన్న పవన్ వీధి రౌడి భాషలో మాట్లాడటం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు. రాజకీయాలలో సామాన్యుడి ఇంటికి వెళ్లి ఓట్లు అడుక్కోవాలని అన్నారు. అయితే ఉద్యమం మంచి కోసం చేస్తే కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలా మంది ఉంటారని అన్నారు. పవన్ భాష వల్ల నష్టం తప్ప లాభం ఎంత మాత్రం ఉండదని చెప్పారు.

ఇప్పటివరకు ఎంత మందిని చెప్పుతో కొట్టారో.. గుండ్లు గీయించారో సెలవు ఇవ్వాలన్నారు. దుర్మార్గపు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీలతో కలిసి పోటీ చేస్తామని పవన్ తరచూ చెబుతున్నారని.. అలాంటప్పుడు తనను ముఖ్యమంత్రిని చేయమని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయమని కోరాలన్నారు. దీనిపై జనసేన నాయకులు వారి వారి శైలిలో స్పందిస్తున్నారు.

Exit mobile version