Site icon Prime9

MP Vijayasai Reddy: నువ్వు ఎప్పటికీ లేవలేవు బాబు.. విజయసాయిరెడ్డి

vijayasaireddy-chandrababu

Andhra Pradesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తో సొంత నేతలపైనే చిందులు వేస్తున్నాడంటూ సెటైర్లు వేసారు.

తానెప్పుడూ పొత్తుల గురించి మాట్లాడలేదంటూ మళ్లీ బొల్లి కబుర్లే చెబుతున్నాడు చంద్రబాబు. వన్ సైడ్ లవ్ అంటూ విరహవేదనతో ఢిల్లీలో షేక్ హ్యాండ్ ఇవ్వగానే మిత్రవిందలా మెలికలు తిరగలేదా బాబూ? నీది ఏ సైడ్ లవ్ అయినా 2024 మాత్రం వార్ వన్ సైడే, అది YSRCP సైడే అని విజయసాయి ట్వీట్ చేసారు.

మరో ట్వీట్ లో ఎలాగూ అధికారంలోకి రాలేనన్న ఫ్రస్ట్రేషన్ తో సొంత పార్టీ నేతలను కరిచేలా ఉన్నాడు చంద్రం. నేను లేస్తే మనిషినికాను, కేసులు పెట్టండి. లేకపోతే సహించనంటూ టీడీపీ నేతలపై చిందులేస్తున్నాడు. నువ్వు ఎప్పటికీ లేవలేవు బాబు. సర్లే ఏముందిలే ఇంక. పడుకో! అంటూ రాసారు.

Exit mobile version