Site icon Prime9

Chandrababu Naidu Arrest : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నేతృత్వంలో “మోత మోగిద్దాం”..

motha mogiddam event by tdp for justice on chandrababu naidu arrest

motha mogiddam event by tdp for justice on chandrababu naidu arrest

Chandrababu Naidu Arrest : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా టీడీపీ అధిష్టానం ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ “మోత మోగిద్దాం” అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఢిల్లీలో నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టగా.. రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణితో పాటు పలువురు మహిళలు ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేస్తూ మోతమోగించారు.

ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు తమకు నచ్చిన పద్దతిలో మోత మోగించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. చంద్రబాబుకు న్యాయం కోసం కాదు.. ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నామని తెలిపారు. న్యాయం జరగడం ఆలస్యం అవుతుంది కానీ కచ్చితంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

మరోవైపు ఢిల్లీలో గంట మోగిస్తూ లోకేశ్ నిరసన తెలియజేయగా.. ఆయనతో పాటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ సర్కారుపై , సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో వున్న లోకేష్ వద్దకు సీఐడీ అధికారులు వచ్చి నోటీసులు అందజేశారు. అక్టోబర్ 4న తాడేపల్లిలోని ఏపీ సీఐడీ కార్యాలయంలో ఉదయం పది గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో కోరారు.

 

 

 

Exit mobile version