Site icon Prime9

MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ

CM Jagan

CM Jagan

MLC Candidates: ఆంద్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. స్థానిక సంస్థల కోటా నుంచి 9 స్ధానాలు, ఎమ్మెల్య కోటా నుంచి 7, గవర్నర్ కోటా నుంచి 2 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అభ్యర్థులను ఎంపిక చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ సాధికారిత సాధించాలన్న లక్ష్యంతోనే జగన్ ముందుకు వెళ్లున్నారని సజ్జల ఈ సందర్భంగా అన్నారు.

 

స్థానిక సంస్థలకు(MLC Candidates)

నర్తు రామారావు, శ్రీకాకుళం (బీసీ)

కుడిపూడి సూర్యనారాయణ, తూర్పుగోదావరి( బీసీ)

వంకా రవీంద్రనాథ్‌,పశ్చిమగోదావరి ( పారిశ్రామిక వేత్త)

కవురు శ్రీనివాస్‌, పశ్చిమగోదావరి (బీసీ)

మేరుగు మురళీధర్‌ (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు)

సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు)

పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి,కడప(ఓసీ)

ఎ.మధుసూదన్‌, కర్నూలు(బీసీ)

ఎస్‌.మంగమ్మ, అనంతపురం(బీసీ)

 

ఎమ్మెల్యేల కోటా

పెన్మత్స సూర్యనారాయణరాజు, విజయనగరం(క్షత్రియ)

పోతుల సునీత, బాపట్ల (బీసీ)

కోలా గురువులు, విశాఖపట్నం( ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌))

బొమ్మి ఇజ్రాయల్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ (ఎస్సీ)

జయమంగళ వెంకటరమణ, ఏలూరు

చంద్రగిరి ఏసురత్నం,గుంటూరు ( వడ్డెర)

మర్రి రాజశేఖర్‌, పల్నాడు( ఓసీ-కమ్మ)

 

గవర్నర్‌ కోటా

కుంభా రవిబాబు, అల్లూరి సీతారామరాజు(ఎస్టీ)

కర్రి పద్మశ్రీ, కాకినాడ(బీసీ)

Exit mobile version