Site icon Prime9

Minister Roja: తెదేపా పై రోజా విసుర్లు

Rosa throws on Tdp

Rosa throws on Tdp

Amaravati: మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఇవ్వాలని, వారికి రాజకీయాల్లో 50శాతం కట్టబెట్టేలా చట్టాలు తేవాలనుకొనే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల పై అసభ్య పదజాలంతో విరుచుకుపడే మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా మాటలు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న 4వ రోజు సభలో మరోమారు మంత్రి తెదేపా వర్గీయుల పై తన మాటల దాడిని కొనసాగించారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రజా సాధికారత సర్వే డాటా సేకరించి దుష్ట పన్నాగం పన్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పై నిలదీస్తున్న తెదేపా ఎమ్మెల్యేలను పిచ్చి పట్టినోళ్లలాగా వ్యవహరిస్తున్నారని రోజా వారిని దుయ్యబట్టారు. మెంటల్ హాస్పిటల్ లో చేర్చాలని పరుషంగా మాట్లాడారు. డేటా చౌర్యం పై సమగ్ర విచారణ జరగాలని పేర్కొంటున్న రోజా, గడిచిన మూడు సంవత్సరాలుగా తామే అధికారంలో ఉన్నామన్న సంగతిని మరిచారు.

ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయించారన్న రోజా, గతంలో 23 వైకాపా ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకొన్నారన్నారు. మాజీ సీఎం కొడుకు నారా లోకేష్ బాడీతో పాటు మైండ్ లో గుజ్జు కూడా కరిగిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. అయితే గతంలో లోకేష్ లావుగా ఉన్నాడని రోజా పప్పుగా సంబోధించిన రోజులను ఆమె మరిచిపోయింది. ఏపీలో ప్రతిపక్షం అవసరం లేదని మంత్రి రోజా స్పష్టం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాల పోకడను మరోమారు తెలుగు ప్రజలకు తెలిసేలా మాట్లాడారు. ఎందుకంటే తెలంగాణాలో కూడా అక్కడి ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా ఉండాలని పలు ప్రయోగాలు చేసింది. నగిరిలోని తన ఇంటికి వచ్చి జనసేన నేతలు మాట్లాడాలని రోజా సవాల్ విసిరారు. అయితే రాష్ట్రంలో ఎక్కడ నుండైనా పరిపాలన చేయ్యొచ్చని పదే పదే చెప్పిన రోజా జనసేన నేతలకు మాత్రం నగిరి రావాలంటూ మాట్లాడి రెండు నాల్కల ధోరణిని వ్యక్త బరిచడం పట్ల మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న సామెతను రోజా గుర్తుకు తెప్పించారు.

మొత్తం మీద రోజా పదే పదే ప్రతిపక్ష నేతలపై మాటల దాడి చేయడం, అది కూడా పురుషులు సైతం ఆలోచించి మాట్లాడే ఆ పదజాలం పై సర్వత్రా చర్చ సాగుతుంది.

Exit mobile version