Andhra Pradesh: చంద్రబాబు నాయుడు అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు అన్యాయం చేసారని మంత్రి గుడివాడ అమర్‌నాధ్ ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతాం. బిల్లు పెట్టిన తరువాత సీఎం ఎప్పుడైనా విశాఖ ఎప్పుడైనా రావచ్చని ఆయన తెలిపారు.
అమరావతి వివాదాలు, వాస్తవాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు, పలు రాజకీయ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలో 29 గ్రామాలు తప్పితే, మిగిలిన జిల్లాలు అవసరం లేదా? అని ప్రశ్నించారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని రైతులు అంటున్నారని, విశాఖకు రాజధాని వద్దని చేస్తున్న పాదయాత్ర ఇదని, ఇది దండయాత్రేనని అన్నారు.
ఉత్తరాంధ్ర పై దండయాత్ర చేస్తే, ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. దానికి చంద్రబాబే కారణమవుతారు. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరని అమర్‌నాధ్ పేర్కొన్నారు.