Andhra Pradesh: ఏపీలో పేరుకే మూడు రాజధానులని, పాలనంతా విశాఖ నుండే సాగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదురావు అన్నారు. సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
మన విశాఖ, మన రాజధాని పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో సేకరించిన 33వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సహకరించడం లేదనే వైకాపా పై బురద జల్లుతున్నారని ధర్మాన విమర్శించారు. విజయవాడ-గుంటూరు మద్య రాజధాని వద్దని శ్రీకృష్న కమిటి చెప్పిందన్నారు. విశాఖవాసుల్లో చలనం తీసుకురావాలనే రాజీనామా అన్నానని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
ఇక మూడు రాజధానులు అంటున్న వైకాపా నేతలకు ధర్మాన తన మాటలతో ఇరుకున పెట్టేశారు. విశాఖ నుండే పూర్తి పాలన అంటూ కొత్త పల్లవి అందుకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో మారు రాజధాని అంశం అయోమయానికి గురికానుంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసు పై దృష్టి.. పవన్ కల్యాణ్