Site icon Prime9

Minister Gudivada Amarnath: ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన.. మంత్రి గుడివాడ అమర్ నాథ్

gudivada-amarnath

Amaravati: మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే, చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. మూడు రాజధానులకు సంబంధించిన స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు. గతంలో రాజధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి, కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని అన్నారు.

అయితే కొవిడ్ కారణంగా ఇది కొంత ఆలస్యం అయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ఆరంభించవచ్చని అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్ అడుగులు ముందుకు వేస్తుంటే, దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి అమరావతి నుంచి అరసవెల్లి యాత్రకు ఉసిగొల్పారని విమర్శించారు.

Exit mobile version