Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల పై అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో నారాయణరెడ్డి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి చంద్రబాబు రూ.1,571 కోట్లు ఖర్చుపెడితే, జగన్ ప్రభుత్వం రూ.488 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు, అంటే ఉత్తరాంధ్రను జగన్ సర్కార్ చిన్న చూపు చూసిందని అంకెల ద్వారా అంగీకరించారని టీడీపీ ట్రోల్ చేస్తోంది.
దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై సెటైర్లు వేసారు. గుడ్ మార్నింగ్ @ysjagan ఈఎన్ సి దెబ్బకి ఉదయాన్నే గూబ గుయ్యిమని ఉంటుందే, ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మీ ప్రభుత్వమే ప్రకటించడం దేవుడి స్క్రిప్ట్! దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన మీరు ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడటం సెల్ఫ్ గోల్ వేసుకోవడమే అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసారు.
మరోవైపు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఈ వీడియోను ట్వీట్ చేశారు. అతడి పాలనలో, అతడి బొమ్మ వెనుక పెట్టుకొని, అతడి ప్రభుత్వమే ఉత్తరాంధ్ర రైతులకు అతడి కన్నా టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు చేసిందే చాలా ఎక్కువ అని గణాంకాలతో సహా చెబుతూ, అతడి వైఫల్యాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాకనైనా ఉత్తరాంధ్ర ప్రజలకు అర్ధం కావాలి. ఉత్తరాంధ్రకు ఎవరు మేలు చేసారో అన్నారు.