Site icon Prime9

Weather Update: దండికొడుతున్న వానలు.. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి.. పాఠశాలలకు సెలవు

latest Weather Update in TS And Ap

latest Weather Update in TS And Ap

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారడంతో ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికాలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. మరోవైపు గోదావరికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దానితో, ఏజెన్సీ గ్రామాలు సహా పలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.

విశాఖపట్నం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. గోదావరికి వాననీరు పోతెట్టుతుండడంతో పోలవరం ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేసి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో అయితే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రజలను భయపెడుతున్నాయి. పాడేరు మండలం రాయగడ్డ వంతెన నీట మునగడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా వర్ధనపుట్టు మత్స్యగడ్డ పొంగడంతో 50 గ్రామాలకు ఇతర బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం అయితే పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయింది. అయితే ఇదే పరిస్థితి మరో నాలుగు రోజులపాటు కొనసాగుతుందని.. భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వార్నింగ్‌ ఇచ్చింది.

పాఠశాలలకు సెలవులు(Weather Update)

ఇక ఇటు తెలంగాణలో సైతం వాన ముసురు పెట్టింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో.. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్నీ స్కూల్స్‌కు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించింది. వర్షాల ప్రభావంతో పిల్లలు ఇబ్బందులూ పడొద్దని కొన్ని ప్రైవేటు పాఠశాలలు స్వచ్చందంగా సెలవులు ఇచ్చుకున్నాయి. మరికొన్ని పాఠశాలలు అన్ లైన్ క్లాసెస్ జరుపుతున్నాయి. వర్షం, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో పరిస్థితిని బట్టి ఆయా జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar