Amaravati: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత శుక్రవారం కోలగట్ల ఒక్కరే నామినేషన్ వేయడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం అయ్యింది. కోన రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కోలగట్లను ఎంపిక చేశారు. అసెంబ్లీలో కోలగట్లను సభాధ్యక్ష స్థానంలో ముఖ్యమంత్రి జగన్ కూర్చోబెట్టారు. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ స్పీకర్‌ను సభ్యులు అభినందించారు.
ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్దీకరణలో వైశ్యసామాజకి వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ ను తప్పించారు. అయితే ఆ సామాజిక వర్గం నుంచి మరెవరికీ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఈ నేపధ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన కోలగట్లను డిప్యూటీ స్పీకర్ గా నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీనితో అప్పటివరకూ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘపతి రాజీనామా చేయడం, కోలగట్ల ఆ పదవికి నామినేషన్ వేయడం జరిగిపోయాయి. మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో కోలగట్ల డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.