Site icon Prime9

Kodali Nani : లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందన్న వైసీపీ నేత కొడాలి నాని.. నిజం గెలవాలి యాత్రపై కూడా విమర్శలు

Kodali Nani shocking comments on nara lokesh and bhuvaneswari

Kodali Nani shocking comments on nara lokesh and bhuvaneswari

Kodali Nani : వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ లీడర్ నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ సమర్ధుడైతే ఇంట్లోని మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని కామెంట్ చేశారు. ఈ మేరకు గుడివాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన లోకేష్ ఢీల్లీ పారిపోయి.. తన తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు. దాంతో లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని నాని హేళన చేశారు. అలానే నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంపై కూడా కొడాలి విమర్శలు గుప్పించారు.

నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురాడు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు.. భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంది. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2 వేల కోట్లు దాటింది. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ.35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు?. కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా?’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెర వెనుక టీడీపీకి మద్దతుగా ఉన్నాడని ఇప్పుడు ముసుగు తొలగింది అంతేనని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జన సున్నా పార్టీ పెట్టారన్నారు.

 

Image

 

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మరణించగా వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టారు. నేటి నుంచి బస్సు యాత్ర కొనసాగనుండగా.. వారానికి మూడు రోజుల పాటు దీనిని కొనసాగిస్తారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar