Nara Lokesh on Ntr: యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశంగా మరాయి. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతోంది.
రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్.. (Nara Lokesh on Ntr)
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంపై తెదేపా నేత నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. ఆహ్వానిస్తారా అని యువత నుంచి ఎదురైన ప్రశ్నకు లోకేష్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో .. ఎవరైతే రాష్ట్రంలో మార్పు వచ్చి అగ్రస్థానంలోకి వెళ్లాలని కోరుకుంటున్నారో.. ఆంధ్రులు గర్వపడెలా ఉండాలని ఎవరు ఆశిస్తారో వాళ్లంత రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. మార్పు కోసం ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే.. వంద శాతం ఆకాంక్షిస్తానని లోకేష్ అన్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దే దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. తెదేపా పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. ప్రజలతో కలసి నడుస్తున్నారు. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా..?
జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మరోపైవు.. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని చాలా మంది అంటున్నారు. కానీ ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. రాజకీయాల గురించి జూనియర్ ఎక్కడా కూడా తన మనసులో మాట చెప్పలేదు. ఎన్టీఆర్ నటనా వారసత్వాన్ని పుచ్చుకున్న.. రాజకీయ వారసత్వ విషయంలో ఎన్టీఆర్ చాలా అణకువతో ఉన్నారు. రాజకీయాల గురించి ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అసలు తాను రాజకీయ ప్రపంచంలో లేనట్టే జూ. ఎన్టీఆర్ ఉంటున్నారు. ఇదే ఆయనకి ప్రత్యేక ఆకర్షణ. ఆయన ప్రస్తుతం తెదేపాకు దూరంగా ఉంటున్నారు. 2009లో వైఎస్‌ఆర్ హవా సాగుతున్న సమయంలో.. ఎన్టీఆర్ తెదేపాకు ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో.. ఉపన్యాస తీరు అందరిని ఆకట్టుకుంది.
అదే సమయంలో.. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ కూడా ఏర్పాటు చేశారు. ఓ వైపు కాంగ్రెస్.. మరో వైపు ప్రజారాజ్యం ఉన్న కూడా జనం టీడీపీ వైపు చూసేలా చేశారు. 2009లో చివరిసారిగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎక్కడ కూడా రాజకీయాల జోలికి పోలేదు. 2014 ఎన్నికల్లో ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తానని.. రాననిగానీ స్పష్టంగా చెప్పలేదు. కానీ ప్రస్తుతం లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీని కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.