Janasena Formation Day: ప్రజలకు సేవ చేయడానికే జనసేన పుట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీ పట్నం నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నించడం కోసమే ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా జనసేన అండగా ఉంటుందని అన్నారు.
పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో చూశాం..
జనసేన ఆవిర్భాంచి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని అన్నారు.
జనసేన పార్టీ పెట్టినప్పుడు తనతో కొద్దిమంది మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలియదన్నారు.
చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సు గురించి ఆలోచనతోనే ప్రజల్లోకి వచ్చినట్లు తెలిపారు.
అభిమానులు ఇచ్చిన ధైర్యం.. సమాజంలో జరుగుతున్న చెడును చూసే పార్టీని స్థాపించినట్లు తెలిపారు.
ఈ పార్టీ ఏర్పాటుకు స్వాతంత్ర్య సమరయోధులను స్పూర్తిగా తీసుకున్నట్లు ఆయన అన్నారు. సగటు మనిషికి న్యాయం చేయాలన్నదే తల తపన అని సభావేదికగా తెలిపారు.
రెండు చోట్ల ఓడిపోయిన బాధలేదు.. (Janasena Formation Day)
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్యవేదిక సాక్షిగా మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాను రెండు చోట్ల ఓడిపోయినప్పటికి తనకు బాధ లేదని.. ప్రజల కోసమే తాను పని చేస్తానని అన్నారు. తెలంగాణ వచ్చాక ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టామని అన్నారు.
ఓట్లు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. కానీ వారికి ప్రయోజనం చేకూరాలి. ఎంతో ధైర్యం చేసి పార్టీ పెట్టాం. అసలే చీకటి, గాడాంధకారం ఉంది. అమృతం కురిసిన రాత్రిలో కవిత చదివారు.
సగటు మనిషికి మేలు చేయాలన్న తపన, అవగాహన తప్ప ఏం లేదు. పార్టీకి స్ఫూర్తి స్వాతంత్ర్య ఉద్యమ నేతలు.
పింగళి వెంకయ్య గారి చరిత్రలో ఆయన ఆకలికి అలమటించి చనిపోయారన్న వార్త బాధేసింది. నేతాజీ గురించి మీ అందరికీ పూర్తిగా తెలీదు. బ్రిటిష్ వారు నేతాజీకి భయపడి స్వాతంత్ర్యం ఇచ్చారు.
ఏపీ అవతరణకు పొట్టి శ్రీరాములు బలిదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన వల్ల ఏర్పడింది. మనవంతు కృషి చేద్దాం అని భావించా.
రుద్ర వీణ సినిమాలో నువ్వు తినే ప్రతి మెతుకు సమాజం ఇచ్చింది. రుణం తీర్చుకునే టైం వస్తే తెప్పతగలేస్తావా అని రాశారు. మీరు గుండెల్లో పెట్టుకున్నారు.
ఇంతమంది నా వెనుక ఉన్నారు. నా మొదటి అడుగు అసమానతలు, పేదలకు అండగా ఉండడమే పార్టీ లక్ష్యం అన్నారు పవన్ కళ్యాణ్.