Site icon Prime9

Janasena : వారాహితో యాత్రకి సిద్దమైన జనసేనాని.. జూన్ 14 నుంచి “మనల్ని ఎవడ్రా ఆపేది” !

janasena chief pawan kalyan varahi yatra tour details

janasena chief pawan kalyan varahi yatra tour details

Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఈ నెల 14 నుంచి యాత్ర మొదలు పెట్టనున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన వారాహి వాహనంలో ఆయన పర్యటన చేయనున్నారు. అన్నవరంలో పూజ చేసిన తర్వాత పవన్ యాత్ర ప్రారంభమవుతుంది అని వెల్లడించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్ర పొత్తులో భాగంగా జరిగేది కాదని స్పష్టం చేశారు.

తొలి విడత యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి గన్నవరం నుంచి నర్సాపురం వరకు చేరుతారు. అన్నవరం నుంచి భీమవరం వరకు తొలి విడత యాత్ర సాగుతుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర షెడ్యూల్ ఖరారైంది. తూర్పు గోదావరిలోని పది నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. పర్యటనలో ప్రతి రోజూ ఒక ఫీల్డ్ విజిట్ ఉంటుందని పార్టీ అధిష్టానం తెలిపింది.

 

 

Exit mobile version