Site icon Prime9

Pawan Kalyan : దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు చేస్తారని వైసీపీ నేతలపై ఫైర్ అయిన పవన్.. ముదినేపల్లిలో బహిరంగ సభ.. లైవ్

janasena chief pawan kalyan speech from varahi yatra at mudinepalli

janasena chief pawan kalyan speech from varahi yatra at mudinepalli

Pawan Kalyan : దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు చేస్తారు వైసీపీ నేతలు అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. నేడు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం లోని ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కులాల పేరుతో విడగొట్టే వాళ్ళం మేం కాదని.. ఒక రోడ్డు లేక ముక్కేదంటే చుట్టూ చూపించినట్టు రావడంతో ఆలస్యం అయిందని దుయ్యబట్టారు. పెద్దింట్లమ్మ ఆలయం దగ్గర వంతెన వేయలేరని.. వచ్చి ఎన్నికలకు ఓట్లు ఎలా అడుగుతావు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన జనసేనకు భయపడనక్కర్లేదని వైసీపీ నేతలంటారు. కానీ 175కి 175 కొట్టేస్తామనే వైసీపీ నేతలకు భయం ఎందుకు అని ఆయన అన్నారు.

నేను NDA లో ఉంటే ఏంటి.. బయట ఉంటే ఏంటి.. ఎందుకు భయం మీకు‌.. నాకు 151 ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్షం ఊసే నేను ఎత్తను.. కైకలూరు ఎమ్మెల్యే, ఆయన కొడుకు పోలీసు స్టేషనులో కూచుని మరీ చేసే పనులను తేలుస్తామన్నారు. 2009లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఎదుర్కొని నిలబడిన వాడిని.. ఓడిపోయినా హైదరాబాద్‌లోనే ఉన్నా ఎక్కడికీ పారిపోలేదఅని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇక 2014లో అనుభవజ్ఞుడైన సీఎంగా చంద్రబాబుకి, ప్రధాని నరేంద్ర మోడీకి సపోర్ట్ ఇచ్చామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ అధికారంలోకి 2014లో రాకపోతే నా పరిస్ధితి ఏమయ్యేదో ఊహించండి.. నా ఆఫీసుపై వైసీపీ గుండాలు దాడికి సిద్ధంగా ఉంటే నేను ఆపీసులోనే ఉన్నా.. రేపు మేం గెలిస్తే మీరు మీ ఆఫీసుల్లో, ఇళ్ళలో ఉండాలో లేదో నిర్ణయించుకోండి అని ఆయన తెలిపారు.

నువ్వెంత నీ బ్రతుకెంత జగన్‌ అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచీ మీడియాలో ఏం వాక్కుంటారో వాక్కోండి.. మేం ఏమీ మర్చిపోలేదు.. ఇదే పోలీసు స్టేషన్ లో పంచాయితీ పెడతాం మీకు.. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం.. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తాం.. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు అసలు సర్టిఫికేట్ లు ఇవ్వలేకపోయారు అని ఆయన మండిపడ్డారు.

80 కిలోమీటర్ల రోడ్డుకి దిక్కు లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే దారిలో ఒక మహిళ, భర్త పడిపోయారు రోడ్డు మీద గుంతలతో.. చుట్టూ కొల్లేరు ఉన్నా 6 వేల మంది ఇబ్బంది పడుతున్నారు అని నాకు లెటర్ ఇచ్చారు.. కిడ్నీ రుగ్మతలు వస్తున్నాయి.. జనసేన-టీడీపీ ప్రభుత్వంలో నీట సమస్యల బాధ్యత నేనే తీసుకుంటా.. రూ.8600 కోట్ల పంచాయితీ నిధులు దోచేసారు.. మీ బ్రతుక్కి మీ సొంత జేబులోంచి కనీసం పది లక్షలు పంచారా అని ఆయన మండిపడ్డారు. బూం బూం మందు బాటిల్ ఎంత.. ఉదయం డబ్బులిచ్చి, సాయంత్రం మందు రూపంలో పట్టుకుని వెళ్ళిపోతున్నారు.. కల్తీ మందు అధికారికంగా అమ్ముతుంటే చూస్తూ కూర్చున్నాం.. ఆడపడుచులు కోరుకుంటే మందు నిషేధిస్తామని పవన్ వ్యాఖ్యనించారు.

 

Exit mobile version