Site icon Prime9

Pawan Kalyan: బీమాతో కార్యకర్తల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..

Janasena chief Pawan Kalyan is bringing light to activists' families with insurance

Andhra Pradesh: కుటుంబ సభ్యుల ఆర్థిక తోడ్పాడు, కార్యకర్తల అందించిన విరాళాలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు పార్టీ బలోపేతానికి అటు కార్యకర్తల భరోసాకు అండగా నిలుస్తున్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలుగా గుర్తించిన పవన్ కల్యాణ్ వారికి ప్రమాద భీమాను ఉచితంగా అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ మద్య కాలంలో పార్టీకి చెందిన కార్యకర్తలు వివిధ కారణాలతో మృతిచెందారు. వారందరికీ జనసేన పార్టీ అందించిన బీమా సౌకర్యాన్ని వారికి అందిస్తూ బాధిత కుటుంబాల్లో చిరుదీపాలు వెలిగిస్తున్నారు.

తాజాగా కావలికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త బలికిరి ప్రణయ్ కుమార్ ఇటీవల ప్రమాదంలో మరణించారు. విషయం తెసుకొన్న పార్టీ శ్రేణులు ప్రణయ్ కు రావాల్సిన బీమా నగదును వారికి వచ్చేలా చేశారు. ఈమేరకు బీమా సంస్ధ అందించిన రూ. 5లక్షల చెక్కును పవన్ కల్యాణ్ చేతులమీదుగా మరణించిన కార్యకర్త తల్లి వరలక్ష్మీ, సోదరి ప్రగతిలకు అందించారు. ఓదార్పును అందించిన పవన్ వారి జీవతంలో వెలుగులు ప్రసాదించాలని భగవంతునుని వేడుకొన్నారు.

ఇది కూడా చదవండి: Janasena: పీఏసీలో పలు తీర్మానాలు చేసిన జనసేన.. వైసీపీపై నాదెండ్ల సంచలన కామెంట్స్

Exit mobile version