Site icon Prime9

IT Raids: బిగ్ సీ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు

Big c

Big c

Vijayawada: ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సాంబశివరావు నివాసంతో పాటు, హైదరాబాద్, నెల్లూర్‌లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సాంబశివరావు కుమారుడు స్వప్న కుమార్ బిగ్ సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ,రియల్ ఎస్టేట్ కంపెనీ హానర్ హోమ్స్‌లో భాగస్వామిగా ఉన్నారు. హానర్ హోమ్స్‌లో రూ.360 కోట్ల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇటీవల వస్త్ర వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఐటీ అధికారులు కూకట్‌పల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గ్రూప్‌ కంపెనీలకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఆర్ఎస్ బ్రదర్స్ హానర్ హోమ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది. ఇందుకు సంబంధించి ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించింది.

ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్‌లు, కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాలపై సోదాలు జరిపింది. అలాగే పలు మొబైల్ షాపులకు సంబంధించిన ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. అయితే హానర్ హోమ్స్‌లో భాగస్వామిగా ఉన్న స్వప్న కుమార్ భాగస్వామిగా ఉండటంతో.. ఆయన తండ్రి సాంబశివరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Exit mobile version