Site icon Prime9

CID DIG Sunil Naik: ఎంత స్థలం కబ్జా చేశారనేది కాదు.. ఫోర్జరీ అనేది మాకు ముఖ్యం.. సీఐడీ డీఐజీ సునీల్ నాయక్

ap-CID-DIG-Sunil-Naik

ap-CID-DIG-Sunil-Naik

Andhra Pradesh: ఎంత స్థలం కబ్జా చేశారనేది అనేది మాకు ముఖ్యం కాదు. ఫోర్జరీ చేశారు అనేది మాకు ముఖ్యం. అయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వ్యక్తి మాములు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీఐడీకి ఫిర్యాదు చేశాడు కాబట్టి మేం అరెస్ట్ చేసినట్లు ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ తెలిపారు. అయ్యన్నపాత్రుడి అరెస్ట్ పై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్‌వోసీ ఫోర్జరీ చేశారనే అభియోగాలతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును అరెస్ట్‌ చేసినట్లు సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌ స్పష్టం చేశారు. తమది కాని 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు ఆక్రమించారని తెలిపారు. ఈ కేసులో అయ్యన్నను A1 గా, ఆయన కుమారులు విజయ్‌ A2, రాజేశ్‌ A3 గా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు.

అయ్యన్నపాత్రుడి పై మాకు ఫిర్యాదు వచ్చింది. విచారణ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేశాం. అయ్యన్నపాత్రుడు, విజయ్, రాజేశ్ లపై కేసులు పెట్టాం. అయ్యన్న పాత్రుడుకు రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఆధారాలు తారుమారు చేస్తారు అని అరెస్ట్ చేశాం. తెల్లవారు జామున 4 గంటలకు అరెస్ట్ చేశాం. ముగ్గురు కలిపి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఒక ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేశారు. అయ్యన్నపాత్రుడికి సంఘంలో పలుకుబడి ఉంది కాబట్టి సాక్షాలు తారుమారు అవుతాయి అని అరెస్ట్ చేశామని సునీల్ కుమార్ తెలిపారు.

అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే అభియోగాల పై గురువారం తెల్లవారు జామున నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేశ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. గోడ దూకి అయ్యన్న పాత్రుడి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version