Site icon Prime9

Intelligence warning: వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ వార్నింగ్..

ycp ministers

ycp ministers

Andhra Pradesh: తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయం పై దాడి ఘటన దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. కార్యాలయంలోకి 20 మంది చొచ్చుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు జనసేన వర్గాల నుంచి వినిపిస్తోంది.

జనసేన పార్టీ కార్యాలయం పై ప్రతీకారచర్యగా ఆ పార్టీ కార్యకర్తలు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా దాడి చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. కొంతమంది జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో దాడులకు సంబంధించి బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారని, అందువల్ల మంత్రులు, వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండటం మంచిదని ఇంటెలిజెన్స్ పోలీస్ వర్గాలు సూచించాయి.

ఇంటెలిజెన్స్ పోలీసులు హెచ్చరించిన వైసీపీ నేతల జాబితాలో గుడివాడ అమర్‌నాథ్, బొత్స సత్యానారాయణ, రోజా, అంబటి రాంబాబు, కొట్టు సత్యానారాయణ, జోగి రమేష్, దాడిశెట్టి రాజా, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, జక్కంపూడి రాజా, పేర్ని నాని, గ్రంథి శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్, గొర్ల కిరణ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version