Harirama Jogaiah: వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కు కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రంగా ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ వంగవీటి మోహన రంగా బ్రతికున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి పేద ప్రజల పాలిట దైవంగా మారారని.. పేదప్రజల కోసం నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో దారుణాతి దారుణంగా చంపబడిన మహోన్నత వ్యక్తి అని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని మనం గౌరవించాలని.. రంగా గౌరవార్థం ఆయన పుట్టి పెరిగిన కృష్ణా జిల్లా కు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని ఆయన కోరారు. చాలా కాలం నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు ఈ ప్రతిపాదన చేస్తున్నారని కాపు ఉద్యమ నాయకుడు ఈ సందర్భంగా సీఎంకు గుర్తుచేశారు.
అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకులుగా పేరుపొందిన దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు, అలాగే శ్రీకాకుళం జిల్లాకు జ్యోతీ రావు పూలే పేరు పెట్టాలని గతం నుంచీ తమను కోరడం జరిగిందంటూ ఆయన లేఖ ద్వారా వివరించారు. ఇక నేడు రంగా వర్దంతి సందర్భంగా మీరు ఈ ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే వారిని గౌరవించినట్లుగా ఉంటుందంటూ సీఎం జగన్ ను ఆయన కోరారు. ఈ ముగ్గురు నేతలు కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులు గా పేరు గాంచారని గుర్తుచేశారు. అలాంటి వారి పేర్లు చిరస్థాయిగా నిలిచేలా బడుగు బలహీన వర్గాల అభిలాష మేరకు పనిచేయాల్సిన
బాధ్యత ప్రతీ ప్రభుత్వానికి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ హరిరామ జోగయ్య కోరారు.
ఇకపోతే గతంలోనూ పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని తెదేపా నేతలు భారీ ఎత్తున డిమాండ్ చేశారు. మాజీ మంత్రి టీడీపీ నేత బోండా ఉమా సైతం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రతిపాదనపై సీఎం జగన్ ఏ విధంగా స్పందించనున్నారు.
ఇదీ చదవండి: నా జాతి కోసం తపనే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు- సీఎం జగన్ కు ముద్రగడ లేఖ