Gorumudda: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ మారనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం మధ్యాహ్న భోజనంలో మార్పులు చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకంలో నేటి నుంచి కొత్త మెనూను అమలు కానుంది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త మెనూను పక్కాగా అమలు చెయ్యాలని మిడ్ డే మీల్స్ డైరెక్టర్ స్పష్టం చేశారు.
కొత్త మెనూ వివరాలు ఇలా
- సోమవారం : వేడిపొంగలి, ఉడకబెట్టిన కోడిగుడ్డు/ కూరగాయల పులావు, గుడ్డుకూర, చిక్కి
- మంగళవారం : చింతపండు/నిమ్మకాయ పులిహోర, టమాటా/ దొండకాయ పచ్చడి, ఉడకబెట్టిన కోడిగుడ్డు
- బుధవారం : కూరగాయల అన్నం, బంగాళదుంపలకుర్మా, ఉడకబెట్టిన కోడిగుడ్డు, చిక్కి
- గురువారం : సాంబారు, అన్నం, ఉడకబెట్టిన కోడిగుడ్డు
- శుక్రవారం : అన్నం, ఆకుకూరపప్పు, కోడిగుడ్డు, చిక్కి
- శనివారం: ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపి పొంగలి
ఇదీ చదవండి; నువ్వు జగన్ రెడ్డి కాదు.. రివర్స్ రెడ్డివి.. చంద్రబాబు నాయుడు