Site icon Prime9

Andhra Pradesh: పూడిక తీత తీస్తూ నలుగురు మృతి

Four people died while removing the dust

Four people died while removing the dust

Krishna Dist: పోలీసుల సమాచారంమేరకు, కురిసిన వర్షాలతో బంటుమిల్లి మండల కేంద్రంలోని వంజల రామారావు ఇంటి పాత బావి పూడిపోయింది. పూడికను తొలగించేందుకు నలుగురు కూలీలతో ఒప్పందం చేసుకొన్నారు. ఇంటి యజమాని రామారావుతోపాటు కొడుకు లక్ష్మణరావు, కూలీలు రంగ, శ్రీనివాసరావులు నలుగురు పాతబావిలోకి దిగారు. బావి లోపల ఆక్సిజన్ అందకపోవడంతో అందరూ మృత్యువాత పడ్డారు.

లోనికి దిగిన నలుగురు ఎంతకీ బయటకు రాకపోవడంతో గ్రామస్ధులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అగ్నిమాపక సిబ్బంది వారి రక్షించే లోపుగానే బావిలోకి దిగిన వారంతా అప్పటికే మృతి చెందిన్నట్లు గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

Exit mobile version