Amaravati: శాసనసభలో సీఎం పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అమరావతి కోసం మూడు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నది అంతా కృత్రిమ ఉద్యమంగా కొట్టిపడేసారు. రాజధాని అమరావతిలో వద్దనలేదన్న జగన్, కర్నూలు, విశాఖలు అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర ప్రాంతాల వారి మనోభావాలను రెచ్చగొట్టేలా ఉద్యమం నడుస్తుందని ఆయన ఆరోపించారు. ఆర్ధికంగా స్ధిరపడిన పెత్తందార్లు కోసం చేస్తున్న ఉద్యమంగా చెప్పుకొచ్చారు. నాటి ప్రభుత్వంలో నేటి సంక్షేమ పధకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో 31లక్షల ఇళ్లపట్టాలు, 21లక్షల ఇళ్ల నిర్మాణాలు ఏమయ్యాని ప్రశ్నించారు. అయితే టిడ్కో ఇళ్ల గురించి సిఎం ప్రసంగంలో లేదు. గత ప్రభత్వం గ్రాఫిక్స్ తో ప్రజల్ని మోసం చేసిందన్న జగన్, 5లక్షల కోట్లు అమరావతి నిర్మాణం కొరకు ఖర్చు అవుతుందని మాజీ సీఎం చంద్రబాబు చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి రూ. 2290కోట్లు బకాయిలు పెట్టి వెళ్లన ఘనత చంద్రబాబుదంటూ ఎద్దేవా చేశారు.