Prime9

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. నెల్లూరులో ఈడీ సోదాలు

Nellore: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు నెల్లూరు నగరంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంలో వైసీపీ నేతకు సంబంధించిన కార్యాలయానికి చేరుకున్న, ఈడీ అధికారులు అక్కడ ఉన్న రికార్డులతో పాటు సిబ్బందిని విచారించారు.

ఎవరిని కూడా కార్యాలయంలోకి రాకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 25 బృందాలుగా ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా ఒక బృందం నెల్లూరుకు వచ్చింది. ఈ తనిఖీలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చాంశనీయమయ్యాయి.

Exit mobile version
Skip to toolbar