Site icon Prime9

CM Jagan-Chandrababu: ప్రధాని మోదీకి జగన్, చంద్రబాబుల విషెస్

chandrababu-jagan-wishes-pm-modi

Amaravati: నేడు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపేందుకు, దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షును భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. మోడీని కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.

 

Exit mobile version