Site icon Prime9

Andhra Pradesh: సాంబారులో పడి చిన్నారి మృతి

Child

Child

Kurnool: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి వేడి సాంబారులో పడి చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన నాగరాజు, రామేశ్వరమ్మలకు ఇద్దరు కుమారులు. మూడు రోజుల కిందట ఎమ్మిగనూరులోని తమ బంధువుల ఇంట్లో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్లారు. అందరూ కలిసి వున్న సమయంలో వారి మూడేళ్ల కొడుకు సోమనాథ్ (3) ముద్దు మాటలు అందరినీ అలరించాయి.

భోజనాల కోసం సిద్దం చేసిన సాంబారును ఓ పక్కగా ఉంచారు. అయితే ఆడుకుంటూ అటుగా వెళ్లిన సోమనాథ్, ప్రమాదవశాత్తు సాంబారు గిన్నెలో పడిపోయాడు. అప్పుడే పెట్టిన సాంబార్ కావడంతో చాలా వేడిగా ఉంది. దీంతో ఒళ్లంతా కాలిపోయి కేకలు వేసాడు. అది గమనించిన బంధువులు వెంటనే బాబును సాంబార్ లోంచి తీసి, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాబు చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనితో బంధువులు విషాదంలో మునిగిపోగా తల్లిదండ్రులు కుప్పకూలారు.

Exit mobile version