Kodi Kathi Case: కోడికత్తి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థకి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగుచూసింది. ప్రజల్లో జగన్ కు సానుభూతి రావాలనే దాడి చేసినట్లు పేర్కొన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలనేదే తన ఉద్దేశమని వాంగ్మూలంలో తెలిపాడు.
వాంగ్మూలంలో కీలక విషయాలు (Kodi Kathi Case)
కోడికత్తి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించాడు. ప్రజల్లో జగన్ కు సానుభూతి రావాలనే దాడి చేసినట్లు పేర్కొన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలనేదే తన ఉద్దేశమని వాంగ్మూలంలో తెలిపాడు.
జగన్‌కు ప్రాణహాని జరగవద్దనే.. భుజంపై పొడవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. నొప్పి రాకుండా.. కోడికత్తికి రెండుసార్లు స్టెరిలైజ్ చేసినట్లు వెల్లడించాడు. కత్తి దాడి తర్వాత.. ఏమీ కాదులే అన్నా! అని జగన్ కి చెప్పినట్లు వెల్లడించాడు. మెుదటి నుంచే తాను వైఎస్ రాజశేఖర్ అభిమానినని తెలిపాడు. 2019 ఇచ్చిన వాంగ్మూలం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
జగన్ పాదయాత్ర వల్ల.. ఆయనపై అభిమానం పెరిగినట్లు.. ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రం తలరాత మారుతుందని అందుకే అలా చేశానని చెప్పాడు. భుజాలపై కోడికత్తితో దాడి చేసిన ప్రాణహాని ఉండదని అందుకే ఆలా చేశానని అందులో వివరించాడు. దీనివల్ల జగన్‌కు సానుభూతి లభించి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఊహించినట్లు చెప్పాడు.
అవయవాలు దానం
కోడికత్తి దాడి అనంతరం తనకు ఏదైనా ప్రాణహాని కలిగితే.. నా అవయవాలను దానం చేయాలని తల్లిదండ్రులను కోరినట్లు శ్రీనివాసరావు తెలిపాడు.
దాడి తర్వాత నన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తెదేపా కోసమా? వైకాపా కోసమా? ఎవరి కోసం దాడి చేశావని నన్ను అడిగారు.
నా కోసం, ప్రజల కోసమే చేశానని మాత్రమే వారికి సమాధానం చెప్పాను. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్‌కు అభిమానిగా మారినట్లు వాంగ్మూలంలో తెలిపాడు.
టీడీపీతో సంబంధం లేదు..
కేసును క్షుణ్ణంగా విచారించామని, సాక్షులందరినీ విచారించిన తర్వాతే చార్జిషీటు దాఖలు చేశామని ఎన్‌ఐఏ తెలిపింది.
ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు, హోటల్ ఉద్యోగి జానిపల్లి శ్రీనివాస్‌రావుకు తెదేపాతో లేదా మరే ఇతర రాజకీయ పార్టీతో సంబంధం లేదని పేర్కొంది.
రెస్టారెంట్ యజమాని టి హర్షవర్ధన్ ప్రసాద్ టిడిపి సానుభూతిపరుడే అయినప్పటికీ, కేవలం కార్మికుడు మాత్రమే.
అయిన నిందితుడితో అతనికి ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలిందని ఎన్‌ఐఏ తెలిపింది.
ఇప్పటికే కోర్టులో విచారణ ప్రారంభమైనందున, ఈ కేసుపై మరో దర్యాప్తు అవసరం లేదని పేర్కొంది.
శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీమ్ కూడా జగన్ మోహన్‌రెడ్డి పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్ కు అర్హత లేదని అన్నారు.