Site icon Prime9

Botsa Satyanarayana: చంద్రబాబుకు చివరికి ఎన్నికలు అనేది తథాస్తు.. మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Andhra Pradesh: 2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పినట్టుగా జరుగుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు జరుగుతుందన్నారు. మనం ఏదైనా మాట్లాడితే పైన తథాస్తు దేవతలు దీవిస్తారని పెద్దలు చెబుతారని గుర్తు చేసారు.

రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు కాటకాలు వస్తాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా చంద్రబాబు వ్యవహరించేవాడని ఆయన విమర్శించారు. చంద్రబాబు భార్యను ఎవరు అవమానించారో చెప్పాలన్నారు. అసెంబ్లీలో రికార్డెడ్ గా ఎవరైనా తప్పుగా మాట్లాడారో చూపించాలన్నారు. ఇలా అవమానిస్తే ఎవరూ హర్షించరని బొత్స సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబుకు జాలి, దయ లేవని బొత్స అన్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు నిన్న పర్యటించారు. ఈ సమయంలో నిర్వహించిన రోడ్ షో తనకు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన ప్రజలను కోరారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈసారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version