Andhra Pradesh: చిలకలూరి పేట నియోజకవర్గ రైతులను పరామర్శించే కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఓ కాలువను అలోవకగా దాటేశారు. ఆ ఫోటో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్లితే, పల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలతో అతాకుతలంగా మారిన పంట పొలాలను పరిశీలించేందుకు చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలో చిలకలూరి పేటలోని తూబాడులో అన్నదాతలను కలిసేందుకు పంటపొలాల మీదుగా వెళ్లారు. ఆయన నడిచే మార్గంలోని పొలం గట్లును సునాయసనంగా దాటుకుంటూ వెళ్లారు.
ఈ క్రమంలోనే ఓ సన్న కాలువ అడ్డుగా రావడంతో దాన్ని దాటేందుకు పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను పట్టుకొనే ప్రయత్నం చేశారు. సున్నితంగా తిరస్కరించిన చంద్రబాబు అలోవకగా కాలువను దాటేశారు. ఈ వైపు నుండి ఆ ఘటనను చూసిన కొంతమంది తమ చేతిలోని సెల్ ఫోన్లకు పనిపెట్టారు. ఇంకేమంది 72ఏళ్ల వయసులో అలోవకగా కాలువ దాటిన చంద్రబాబు ఫిట్ నెస్ పై రైతులు చర్చించుకొన్నారు. రైతన్నలకు అండగా ఉంటామనేందుకు ఇంతకంటే ఏముంటుందని నెట్టింట బాబు ఫోటోను వైరల్ చేశారు.
అధికారంలో ఉన్నా, లేకపోయినా తెదేపా అధినేత చంద్రబాబు ప్రజా సమస్యల పై త్వరితగతిన స్పందిస్తారు. ప్రకృతి విలయ తాంఢవం, కష్ట, నష్టాల సమయాల్లో బాధితులకు ధైర్యం చెప్పేందుకు ఆయన పార్టీ శ్రేణులందరి కన్నా ముందుంటారు. సాయంతో పాటు వారిలో భరోసా కల్పిస్తారు. ఇటీవల భారీ వర్షాల ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు పల్నాడుకు వెళ్లారు.
ఇది కూడా చదవండి: CPI Ramakrishna: పొత్తులకు మేం రెడీ.. ఒక్క భాజపా తప్ప.. కమ్యూనిస్ట్ నేత రామకృష్ణ