Site icon Prime9

Avinash Reddy: కర్నూలులో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి లొంగిపోవాలని జిల్లా ఎస్పీని కోరిన సీబీఐ

ysrcp mp-avinash-reddy going to pulivendula

ysrcp mp-avinash-reddy going to pulivendula

Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆస్పత్రికి సీబీఐ అధికారులు వెళ్లడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఆస్పత్రి ఎదుట పోలీసులు బలగాలు భారీగా మోహరించారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఆస్పత్రికి సీబీఐ అధికారులు..

వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆస్పత్రికి సీబీఐ అధికారులు వెళ్లడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఆస్పత్రి ఎదుట పోలీసులు బలగాలు భారీగా మోహరించారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

గత నాలుగు రోజులుగా.. వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మ దగ్గరే ఉన్నారు. ఆమె గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు.

ఇదే సమయంలో.. ఆస్పత్రి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ఇక సోమవారం విచారణకు హాజరు కావాలని.. సీబీఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

అయితే మరోసారి తాను విచారణకు హాజరు కాలేనని.. అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.

విచారణకు మరో వారం రోజులు గడువు కావాలని అవినాష్ కోరినట్లు సమాచారం. ఇప్పటికే పలు కారణాలతో.. ఆయన విచారణకు హాజరు కాలేదు.

దీంతో ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.

విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి అధికారులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులే.. ఆసుపత్రికి చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆయనను ఏక్షణమైనా అరెస్టు చేస్తారేమోనని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి వద్ద.. పోలీసులు భారీగా మోహరించారు.

అవినాష్‌ను లొంగిపోమనండి..

కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్న సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీతో చర్చిస్తున్నారు.

లొంగిపోవాలని ఎంపీ అవినాష్‌కు చెప్పాలంటూ సీబీఐ అధికారులు ఎస్పీని కోరారు. శాంతిభద్రతల నేపథ్యంలో ఎస్పీతో వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

సీబీఐ అధికారుల విజ్ఞప్తిపై ఎస్పీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version
Skip to toolbar