Amaravathi: రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతులు హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రేపటిదినం త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించనుంది.
మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర శాసనసభకు అధికారం లేదని ఇప్పటికే కోర్టు తీర్పులో పేర్కొనింది. అమరావతి మౌలిక సదుపాయాలతోపాటు చేపట్టాల్సిన అభివృద్ధిని 6 నెలల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసివుంది. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పేర్కొని వుంది. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాదులు అమరావతి అభివృద్ధికి 60 నెలల కావాలని అఫిడఫిల్ కూడా కోర్టుకు తెలియచేశారు. రైతుల పిటిషన్ పై రివ్యూ కాని, సుప్రీం కోర్టుకు వెళ్లడం కాని జరుగుతుందని కోర్టకు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు కూడా చేసింది. అందుకు పిటిషన్ కు సంబంధించిన నెంబరును సుప్రీం కోర్టు ఇంకా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ధిక్కార పిటిషన్ పై రేపటిదినం హైకోర్టు లో విచారణ చేపట్టనుంది.
ఇది కూడా చదవండి: Ap High Court: ఏపీ సర్కార్ కు హై కోర్టులో భంగపాటు