Srikakulam: శ్రీకాకుళంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రౌడీ షీటర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో.. కిరాతక హత్యకు గురయ్యాడు. వేరే కేసు విషయంలో నిందితుడు నోరు జారడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యపై పోలీసులు వివరాలను వెల్లడించారు.
యువకుడి దారుణ హత్య.. (Srikakulam)
శ్రీకాకుళంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రౌడీ షీటర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో.. కిరాతక హత్యకు గురయ్యాడు.
వేరే కేసు విషయంలో నిందితుడు నోరు జారడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యపై పోలీసులు వివరాలను వెల్లడించారు.
ఓ రౌడి షీటర్ భార్యతో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలను తీసింది. మారికవలస ప్రాంతానికి చెందిన రిక్కా జగదీశ్వరావు అనే యువకుడు.. మార్చి 4న దారుణ హత్యకు గురయ్యాడు.
రౌడీషీటర్ గుర్రాల సాయి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. యువకుడిని రెండు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి.. చంపి పూడ్చి పెట్టాడు.
రౌడీ షీటర్ తో పాటు.. మరో 10 మంది ఈ హత్యకు సహకరించారు.
ఓ కేసు విచారణలో నిందితుడే హత్య గురించి నోరు జారడంతో.. అసలు విషయం బయటపడింది.
రిక్కా జగదీశ్వరావు అలియాస్ శివ సొంత గ్రామం తగరపువలసలో నివాసం ఉంటున్నాడు. ఏడేళ్లుగా రౌడీ షీటర్ సాయి వద్ద పని చేస్తున్నాడు.
సాయి బీచ్‌లో గుర్రాల సవారీ వ్యాపారంతో పాటు పెళ్లిళ్లకు గుర్రపు బండ్లను సరఫరా చేస్తుంటాడు. దీనికి సంబంధించిన పనులను శివ చూస్తుంటాడు.
అయితే సాయి భార్యతో శివ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం సాయికి తెలియడంతో.. శివను చంపేయాలని ప్లాన్ చేశాడు.
మార్చి 3న శివను తీవ్రంగా కొట్టి.. అక్కడి నుంచి గాజువాక తీసుకెళ్లాడు. అక్కడ చిత్రహింసలకు గురిచేసి.. టెక్కలి రెవెన్యూలో శివ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
నేరాన్ని ఒప్పుకున్న నిందితుడు..
నిందితుడు సాయిపై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నాయి. దీంతో అతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఓ కేసు విషయంలో విచారిస్తుండగా ఈ హత్య గురించి పోలీసులకు చెప్పేశాడు.
దీంతో శివ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం.. తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. అక్కడే వైద్యులతో మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు.
శివ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.