Site icon Prime9

Botsa Satyanarayana: నీవేమైనా యుగపురుషుడివా? పవన్ కళ్యాణ్ పై బొత్స సత్యనారాయణ ఫైర్

Botha

Botha

Andhra Pradesh: ప్రధానికి ఫిర్యాదు చేయడానికి నీవేమైనా పుడింగివా అని జనసేన పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల పై ఆయన ఘాటుగా స్పందించారు.

పేదల ఇళ్ల కోసం 71 వేల ఎకరాల భూమి సేకరించాం. రూ.11 వేల కోట్లతో 20వేల ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేసాం. మౌళికవసతులకు రూ.15 వేల కోట్లు ఖర్చు చేసాము. జనసేన రాజకీయ పార్టీ కాదు. అది సెలబ్రిటీ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే  ప్రజలు నమ్ముతారా పేదలకు ఇళ్లు ఇవ్వాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. సినిమా నటుడు వచ్చాడని చూసేందుకు వచ్చిన జనాల ముందు ఆవేశంగా మాట్లాడితే సరిపోతుందా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తేల్చేస్తా, తేల్చేస్తా అంటున్నావు కదా. ఏం తేల్చేస్తావని మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. నువ్వు చెప్పేదంతా ప్రజలు నమ్మడానికి నీవేమైనా యుగపురుషుడివా అని మంత్రి అన్నారు. పేదవాళ్లకు ఇళ్లు  ఇవ్వాలనుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలతో ప్రజల్నిమభ్యపెట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు.

గత ఐదేళ్లలో చంద్రబాబు ఎన్ని ఇండ్లు కట్టించారో ఎప్పుడైనా ప్రశ్నించావా అని ఆయన పవన్ ను అడిగారు. ప్రతిపేదవాడికి పక్కా ఇళ్లు ఉండాలని వైఎస్ఆర్ ప్రయత్నించారన్నారు. తండ్రి బాటలోనే జగన్ సాగుతున్నాడని మంత్రి బొత్ససత్యనారాయణ చెప్పారు. పేదలకు శాశ్వత ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామన్నారు. జనసేన రాజకీయపార్టీ కాదన్నారు. జనసేనను తాను పార్టీగా కూడా చూడడం లేదన్నారు. పవన్ వచ్చినా, చనిపోయిన వాంప్ సిల్క్ స్మిత వచ్చినా కూడా జనాలు వస్తారని అందులో విశేషం ఏమీ లేదన్నారు.

Exit mobile version