Site icon Prime9

Ramachandra Yadav : “చాంపియన్స్ ఆఫ్ చేంజ్” అవార్డు అందుకున్న బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్

bcy party chief ramachandra yadav received champions of change award

bcy party chief ramachandra yadav received champions of change award

Ramachandra Yadav : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్’ అవార్డును భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత “బొడే రామచంద్ర యాదవ్” అందుకున్నారు. దేశంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు ఈ అవార్డులను ప్రతి ఏటా ప్రదానం చేస్తుంటారు. సామాజిక సేవా విభాగంలో రామచంద్ర యాదవ్ కు ఈ అవార్డు లభించింది. మంగళవారం బెంగులూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి రామచంద్ర యాదవ్ ఒక్కరికే మాత్రమే ఈ అవార్డు లభించడం విశేషం అని చెప్పాలి. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వ్యాపార వేత్త రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) చాలా కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా నాలుగు నెలల కిందట బీసీవై పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తొలినాళ్ళలోనే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్ధులను నిలిపారు. రామచంద్ర యాదవ్ కు ఈ అవార్డు లభించడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

జ్యూరీలుగా ఎవరంటే.. 

ఈ అవార్డు ఆషామాషీ వ్యవహారం కాదు.. సుప్రీమ్ కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కేజీ బాలకృష్ణన్, విశ్రాంత న్యాయమూర్తిగా జస్టిస్ ఘ్యాన్ సుధ మిశ్రలు అవార్డు ఎంపిక కమిటీలో కీలకం. రామచంద్ర యాదవ్ తో పాటు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, భారతరత్న సిఎన్ఆర్ రావు, పద్మవిభూషన్ డాక్టర్ వీరభద్ర హెడ్గే, పద్మశ్రీ తుల్సి గౌడ, పద్మశ్రీ మంగమ్మ, సినీ నటుడు ఉపేంద్ర, ఎంపీ తేజస్వి సూర్య వంటి ప్రముఖులు చాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు స్వీకరించిన వారిలో ఉన్నారు. అవార్డు కమిటీ ఆధ్వర్యంలో బెంగళూరులో మంగళవారం ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.

అవార్డు అందుకున్న ప్రముఖులు.. 

ఈ అవార్డు అందుకున్న ప్రముఖుల్లో సైన్స్ అండ్ ఇన్నోవేషన్ విభాగంలో సీఎన్ఆర్ రావు (భారత రత్న).. సోషల్ వెల్ఫేర్ విభాగంలో ఎస్ఎం కృష్ణ (పద్మ విభూషన్).. సహా టీమ్ ఇండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్.. సినీ నటుడు ఉపేంద్ర తదితరలు ఉన్నారు.

Exit mobile version