Balakrishna: శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హీరో నందమూరి బాలకృష్ణ హెలికాప్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయ్యిన గ్రాండ్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేస్కుంటూ సోషల్ మీడియాలో నందమూరి ఫాన్స్ రాత్రి నుండి చేస్తున్న హంగామా చూస్తూనే ఉన్నాం.
బాలకృష్ణ ఈ ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన హెలికాప్టర్
బయలుదేరిన కాసేపటికే ఒంగోలు పిటిసి గ్రౌండ్స్ లో బాలకృష్ణ హెలికాప్టర్ ను సేఫ్ గా అత్యవసర ల్యాండింగ్ చేశారు.
పొగ మంచు వల్ల వాతావరణం అనుకూలించని కారణం గా సిగ్నల్ క్లియరెన్స్ ఇవ్వలేదు అందుకే తిరిగి లాండింగ్ చేశారు అని పోలీసులు తెలిపారు.
దీంతో చేసేదేమి లేక రోడ్డు మార్గంలో హైదరాబాద్ కి ప్రయాణమయ్యారు బాలయ్య.
పొగమంచు కారణంగా ఆగిన బాలయ్య హెలికాప్టర్..
హెలికాప్టర్ లో సాంకేతిక లోపం అని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని హెలికాప్టర్ అయితే కండిషన్ లో ఉంది కానీ పొగమంచులో హెలికాప్టర్ ప్రయాణం సాధ్యం కానీ పక్షంలో గమ్యం చేరే అవకాశం లేదని పర్మిషన్ రాలేదని తెలిపారు. మధ్యాహ్నం సమయానికి పొగ మంచు క్లియర్ అవుతుందని చెప్పగా.. ఒంగోలు పీటీసీ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకున్నారు బాలకృష్ణ(Balakrishna). ఆ తర్వాత హైదరాబాద్ ఏటిసి క్లియరెన్స్ రావడంతో ఒంగోలు నుంచి బాలకృష్ణ హెలికాప్టర్ ద్వారా బయలుదేరి హైదరాబాద్ కు వెళ్లారు. ఈ సమాచారం విన్న చిత్ర యూనిట్, అభిమానులు మొదట్లో కొంత ఆందోళన పడ్డప్పటికీ పోలీసులు, బాలకృష్ణ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కుదుటపడ్డారు.
ఇదీ చదవండి
Veera Simhareddy Trailer : ఒక్క డైలాగ్ తో జగన్ సర్కారుకి షాక్ ఇచ్చిన బాలయ్య… పెద్ద కౌంటరే అంటున్న నెటిజన్లు
Joshimath: కుంగిపోతున్న నగరం.. భయం భయంగా ప్రజలు.. జోషిమఠ్‌లో ఏం జరుగుతుందంటే..?
Kuppa Thotti Roja : మంత్రి రోజాకి గట్టిగా ఇచ్చిన నాగబాబు… నీది నోరు కాదు చెత్తకుప్ప తొట్టి అంటూ
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/