Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. వంశీ ఎన్నిక చెల్లదని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వేసిన పిటిషన్‌ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 07:29 PM IST

Amaravati: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. వంశీ ఎన్నిక చెల్లదని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వేసిన పిటిషన్‌ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో వంశీ రిగ్గింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారని, రెండేళ్ల క్రితం పిటిషన్ దాఖలు చేసినా ఇప్పటి వరకు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు.

దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఎమ్మెల్యే వంశీ, గన్నవరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. అనంతరం విచారణను ఈ నెల 28కి వాయిదా వేసారు. వంశీ, ఆయన అనుచరులు బాపులపాడులో ఎమ్మార్వో స్టాంపు ఫోర్జరీ చేశారని, 12 వేల నకిలీ ఇళ్లపట్టాలు పంచారని కూడ పిటిషన్‌లో పేర్కొన్నారు