Amaravati: ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ప్రయత్నాలు చేపట్టింది. దానికి గానూ ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు రంగం సిద్ధం చేసింది. నానాటికీ పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్య, మధ్య తరగతి ఎంప్లాయిస్ కు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్ట్యా, వాహన కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ-స్కూటర్లు అందించేందుకు రూపకల్పన చేస్తుంది.
మొదటగా ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని ఇవ్వనుంది. కాగా కొనుగోలు చేసిన ఈ-స్కూటర్లకు ఒకేసారి కాకుండా 60 నెలల పాటు ఈఎంఐ పద్దతిలో డబ్బులు కట్టే వెసులుబాటును కల్పిస్తోంది. మరియు గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగులకు కూడా ఈ ఈ–స్కూటర్లు కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే సుమారు 10 వేలకు పైగా ఈ-స్కూటర్లు, ఈ-కార్లు ఉన్నాయని,వీటి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో ఈ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో టాటా సంస్థ రెండు చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పెళ్లింట విషాదం… నవ దంపతుల ఆత్మహత్యాయత్నం