Site icon Prime9

AP government: మూడు రాజధానుల పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

ap-govt-supreme-court

Amaravati: ఏపిలో మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా శనివారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపేయాలనుకోవడం శాసన వ్యవస్థ అధికారాలను ప్రశ్నించడమే అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.

సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని సదుపాయాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో తెలిపింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పడం శాసనసభను అగౌరవపరచడమేనని చెప్పింది.

Exit mobile version