Site icon Prime9

CM Jagan: సీఎం జగన్ కడప పర్యటన రద్దు.. ఎందుకంటే..?

interesting details about cm ys jagan amalapuram visit

interesting details about cm ys jagan amalapuram visit

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం నేడు కడప వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముందుగా కడప పర్యటన ఆలస్యం కానుందనే సీఎంవో కార్యాలయం నుంచి సమాచారం వచ్చినప్పటికీ అది సాధ్యం కాలేదు.

కడప విమానాశ్రయంలో దట్టంగా పొగమంచు ఉండడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్‌ రాలేదు. దానితో వాతావరణం అనుకూలిస్తే కడప బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఎంతకీ క్లియరెన్స్‌ రాకపోవడంతో ఈ రోజు కడప పర్యటనను రద్దు చేసుకున్నారు సీఎం జగన్.

అయితే.. షెడ్యూల్‌ ప్రకారం సీఎం జగన్.. మంగళవారం కడప జిల్లాలో పర్యటించాల్సి ఉంది.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు కడప అమీన్‌ పీర్‌ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.25 నుంచి 12.45 కడప మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లిఖార్జున రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు కూడా వెళ్లాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు కడప నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని మొదట షెడ్యూల్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి: శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య

Exit mobile version