Site icon Prime9

Ap Assembly Sessions : బాలకృష్ణకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్.. టీడీపీ ఎమ్మెల్యేలు 15 మంది సస్పెన్షన్

Ap Assembly Sessions updates about tdp mla's suspension

Ap Assembly Sessions updates about tdp mla's suspension

Ap Assembly Sessions : ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. వైసీపీ,టీడీపీ సభ్యులు పోటాపోటీగా వాదోపవాదాలకు దిగారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనసభ కొద్దిసేపటికే వాయిదా పడింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. కానీ సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఉండగా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు దమ్ముంటే రా అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాలకృష్ణను చూస్తూ తొడ గొట్టారు.

ఆ తర్వాత తిరిగి 11 గంటల ప్రాంతంలో శాసనసభ ప్రారంభం కాగా.. స్పీకర్ తమ్మినేని సభ (Ap Assembly Sessions) లో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రకటన చేశారు. టీడీపీ సభ్యుల తీరును స్పీకర్ తమ్మినేని తప్పుబట్టారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మొదటి హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సభ స్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన నందమూరి బాలకృష్ణ సభ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని.. ఇది మొదటి తప్పిదంగా భావించి సభ మొదటి హెచ్చరికను చేస్తుందని ప్రకటించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా తెలిపారు.

సభ (Ap Assembly Sessions) కు సంబంధించిన ఆస్తికి సభ్యులు ఉద్దేశపూర్వకంగా నష్టం కలగజేసినప్పుడు.. ఆ ఆస్తి విలువను సభ్యులు నుంచి రాబట్టడం జరుగుతుందని.. సభలో కే శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లు.. సభా స్థానంలో ఉన్న ఫైల్‌ను చింపివేశారు. వాటిని పగలగొట్టారు.. స్పీకర్ పోడియం వద్ద ఉన్న మానిటర్‌ను పగలగొట్టారు.. వైరును తెంచివేశారన్నారు. వీరి ప్రవర్తన గర్హిస్తూ ఈ మొత్తం వ్యవహరాన్ని గమనించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నానని చెప్పారు. కే శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లను ప్రస్తుత సమావేశాల చివరి రోజు వరకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తమ్మినేని వెల్లడించారు.

అదే విధంగా సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నందుకు 15 మంది టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తూ  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మాణానికి సభ ఆమోదం తెలిపింది. సస్పెన్షన్ కు గురైన టీడీపీ సభ్యులు సభలోనే  నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు.

Exit mobile version