Site icon Prime9

AP Assembly: చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా అన్ ఫిట్.. సీఎం జగన్

ys-jagan-chandrababu

Amaravati: ఏపీ అసెంబ్లీలో సోమవారం పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపు పై ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో జ‌రిగిన చ‌ర్చ‌లో టీడీపీ సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు మంత్రి రాంబాబు.

వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరంను టీడీపీ ప్రభుత్వ హయాంలో నాశనం చేశారని మండిపడ్డారు. తాము పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీకి సంబంధించి జీవో కూడా ఇచ్చామన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం కింద గతంలో రూ. 6.86 లక్షలు ఇస్తే, అధికారంలోకి వచ్చాక రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పామని, దీనిపై జీవో కూడా జారీ చేశామన్నారు. పునరావాసం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 14,110 మంది నిర్వాసితులుకు రూ. 19, 060 కోట్లతో పునరావాసం కల్పించామన్నారు.

తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబే అన్నారు. మొదట స్పిల్‌వే, అప్రోచ్‌ పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత కాపర్‌ డ్యాం కట్టాల్సి ఉంది అన్నారు. మళ్లీ ప్రాజెక్ట్ దగ్గర జయము, జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా అన్‌ఫిట్‌ అంటూ మండిపడ్డారు. తప్పు చేసింది కాక తిరిగి తమ పై నిందలు మోపుతున్నారని, ప్రజలు అన్ని వాస్తవాలను గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పోలవరాన్ని చంద్రబాబు నాశనం చేశారని, టీడీపీ హయాంలో జరిగిన తప్పుల్ని తాము సరి చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Exit mobile version