Site icon Prime9

Attack on Anna canteen: కుప్పంలో మరోసారి అన్నా క్యాంటీన్ పై దాడి..

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ పై అర్థరాత్రి దాడి చేశారు. ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై దాడి చేయడం దుర్మార్గమన్నారు టీడీపీ నేతలు. ఈ వ్యవహారం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అన్న క్యాంటీన్ల పై దాడి జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గర 86 రోజులులగా క్యాంటీన్ నిర్వహణ జరుగుతుందని, అర్థరాత్రి దాడిని త్రీవంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 201 అన్న క్యాంటీన్లను రద్దు చేశారని, ఇప్పుడు పేదవాడి నోటి దగ్గరి కూడు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని, అన్నక్యాంటీన్‌ పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

Exit mobile version