Janasena Party: పవన్ కల్యాణ్ మంచితనం, సహనం మాత్రమే ఇప్పటి వరకు చూశారు. ఇకపై యుద్ధమే, మీరు సిద్ధమా అంటూ జనసేన సైనికులను అడిగితే మార్మోగిన కరాళధ్వనుల నడుమ అభిమానులు ఓకే చేశారు. భావస్వేచ్ఛలో భాగంగానే భావ ప్రకటనను తెలియచేసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు.
నా గుండె ధైర్యానికి కారణం తెలంగాణలో చోటుచేసుకొన్న కొన్ని సందర్బాలే ఆదర్శంగా పవన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణాకు చాలా అవసరం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. లేదంటే శ్రీకాంతాచార్య ఆత్మబలిదానానికి విలువ లేకుండా పోతుంది. 7 లేదా 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ అనేది తెలంగాణ జనసేన సైనికులు చెప్పండి. ఆ దిశలో సాగుతూ కొండగట్టుతోనే ప్రారంభిద్దామని ఆయన అన్నారు.
బలం ఉంది, పోరాట పటిమ ఉంది. కాని ఎలక్షనింగ్ చేసే సత్తా లేదు. బూతుల దగ్గర ఏజెంట్లు కావాలంటే ఒక బలం కావాలి. అధికారం అంతా రెండు కులాలకే పరిమితం కాకుడదన్నారు. నా పార్టీలో అన్ని కులాలు వారు ఉన్నారన్నారు. అందరూ బాగుండాలి అనుకొనే మనస్తత్వంగా చెప్పుకొచ్చారు. వెనుకబడిన తరగతుల వారు కూడా బలంగా స్ధిరపడాలి. అధికారం రావాలి అన్న దిశగా జనసేన నడుస్తుంది. నా జీవితాన్ని పణంగా పెడుతానని పవన్ మాటిచ్చారు. ఆంధ్రాలో జనసేన ఎగరవేద్దాం అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
భాజపా అంటే తనకు గౌరవంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని రౌడీయిజాన్ని తగ్గించేందుకు భాజపా రోడ్ మ్యాప్ కోరానంటూ పవన్ వివరణ ఇచ్చారు. ఆ పార్టీ కూడా దశాబ్ధాల పోరాటంతోనే అధికారంలోకి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. నా వ్యూహాలు కూడా మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమయిందన్నారు. కలిసి పనిచేస్తేనే గాని, ఊడిగం చేసేందులో నేను సిద్ధంగా లేనని పవన్ తేల్చి చెప్పేశారు.
నీచుల్లారా, నా కన్న తల్లిని ఎంత నీచంగా తిట్టించారు, తప్పటడుగులు వేసే నా బిడ్డలను కూడా తిట్టించారు, ఇదేనా వైకాపాలోని కొందరి సంస్కారం అంటూ వారిని అసహ్యించుకొన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: భాష రాదనుకొంటే పొరపాటు.. వైకాపా శ్రేణులుకు పవన్ హెచ్చరిక