Site icon Prime9

Everest: ఎవరెస్ట్ పై రెపరెపలాడిన తెదేపా జెండా.. ఎందుకో తెలుసా..?

tdp flag hoisting an Everest

tdp flag hoisting an Everest

Everest: తెలుగుదేశం పార్టీ జెండా ఎవరెస్ట్ పై రెపరెపలాడింది. అదెలా అనుకుంటున్నారా, ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 80 ఏళ్ల వృద్ధుడు అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే అక్కడి వరకూ వెళ్లి తాను ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునే సీఎం చెయ్యాలంటూ వీడియో సందేశాన్ని ఇస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. మరి ఆ విషయాలేంటో చూసేయ్యండి.

దార్శనికుడు, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించగలిగే నాయకుడైన చంద్రబాబు నాయుడినే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ గద్దె పై కూర్చోబెట్టాలని ఆ వృద్ధ అభిమాని ఓ వినూత్న పద్దతితో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని 5 వేల మీటర్ల వరకు అధిరోహించిన 80 ఏళ్ల వృద్ధుడు గింజుపల్లి శివప్రసాద్‌ తెదేపా జెండా ప్రదర్శిస్తూ పార్టీ పట్ల తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. ‘యావన్మంది తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా మీ రాష్ట్రాన్ని, దేశాన్ని మరచిపోకండి. ప్రస్తుతం మీ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో, దయనీయ స్థితిలో ఉంది. అందరికీ చెప్పి, చంద్రబాబును గద్దె పై కూర్చోబెట్టండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటూ శివప్రసాద్ వీడియో సందేశం విడుదల చేశారు. 80 ఏళ్ల వయసులో ఎవరెస్ట్‌ పై తెదేపా జెండా ఎగరేసిన శివప్రసాద్‌ను చంద్రబాబు నాయుడు అభినందించారు.

ఇదీ చదవండి: అర్థరూపాయే ఉంది అభివృద్ధి చేయలేం.. నన్నేం అడగొద్దు..!

Exit mobile version