Site icon Prime9

Ambati Rambabu: పాదయాత్ర కాదు.. ఫేక్ యాత్ర

ambati-rambabu-on-padayatra

Amaravati: అమరావతి రైతుల మహా పాదయాత్ర 2 పేరుతో ఈరోజు తుళ్లూరు మండలం వెకంటాపాళెం నుండి ప్రారంభమైంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని పక్కన బెట్టి రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనాసాగించాలనే డిమాండ్‌తో రైతులు గతంలో కూడా తిరుపతికి మహా పాదయాత్ర చేపట్టారు. వారు చేపట్టిన ఆందోళనకు 1000 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మరో విడత మహాపాదయాత్రకు పూనుకున్నారు. రైతుల పాదయాత్ర పై ఆగ్రహంతో ఉన్న మంత్రి అంబటి, ట్విట్టర్‌ వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు.

రాంబాబు ట్వీట్‌ పై నెటిజెన్లు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్లతో అంబటిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జగన్‌ చేపట్టిన పాదయాత్రను ఏమంటారు అంబటి అంటూ ప్రశ్నించారు. డైలాగులు చెప్పమంటే భలే చెప్తారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల గురించి అంతా మొసలికన్నీరేనా అని మంత్రిని నిలదీసారు.

 

Exit mobile version
Skip to toolbar