Site icon Prime9

Amaravati farmers Maha Padayatra: అమరావతి మహా పాదయాత్ర ముహుర్తం ఫిక్స్

Fix the timing of the hike

Fix the timing of the hike

Amaravati: అమరావతి రైతులు తలపెట్టిన పార్ట్ 2 మహా పాదయాత్రకు నిర్వహణ కమిటి ముహుర్తం ఖరారు చేసింది. 12వ తేది తెల్లవారుజామున 5గంటలకు పాదయాత్రను తుళ్లూరు మండలం వెంకటాపాలెం నుండి 600మందితో ప్రారంభంకానుంది. మహా పాదయాత్ర పై ఏపి ప్రభుత్వం శాంతి భధ్రతల పేరుతో అడ్డుకొనేందుకు వేసిన పన్నాగాన్ని కోర్టు ఉత్తర్వులతో అమరావతి పరి రక్షణ సమితి, రాజధాని ఐకాస సమన్వవ కమిటి తిప్పికొట్టారు.

తొలుత వెంకటాపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం మహాపాదయాత్ర కోసం ప్రత్యేకంగా సిద్దం చేసిన వెంకటేశ్వర స్వామి రధాన్ని తీసుకొస్తారు. 9 గంటలకు లాంఛనంగా ప్రారంభమయ్యే మహా పాదయాత్ర 2 లో వైసిపి పార్టీ మినహాయిస్తే తెలుగుదేశం, బిజెపి, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు నిర్వాహకులకు తాము కూడా పాదయాత్రలో పాల్గొంటామని అంగీకారం తెలిపారు.

తొలి రోజు వెంకటాపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా సాగిన మహా పాదయాత్ర మంగళగిరికి చేరుకొంటుంది. రాత్రి అక్కడే బస చేయనున్నారు. పాదయాత్రలో ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా నిర్వాహణా కమిటి జాగ్రత్తలు తీసుకొనింది. ఆహారం, రవాణా, త్రాగునీరు, ఆహ్వానం, రధం నిర్వహణ, ఫైనాన్స్ విభాగాలకు కమిటీలుగా ఏర్పాటు చేసుకొన్నారు. పాదయాత్ర పార్ట్ 1 సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ వర్గాల నుండి బెదిరింపులు వచ్చిన నేపధ్యంలో పార్ట్ 2 మహా పాదయాత్రలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకొని మరీ ముందు జాగ్రత్త వహిస్తున్నారు.

పోలీసులు పాదయాత్ర చేపట్టేందుకు అనుమతి నిరాకరించిన్నప్పటికి కోర్టు ఉత్తర్వులతో ప్రారంభించనున్న పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలను ఆధార్ నెంబర్ల తో సహా డిజిపి ఆఫీసులో ఇచ్చేందుకు అమరావతి పరి రక్షణ సమితి, రాజధాని ఐకాస సమన్వవ కమిటి సభ్యులు శివారెడ్డి, శైలజ, మల్లికార్జునరావు, తిరుపతిరావులు శాంతి భద్రతల డిఐజీ అమ్మిరెడ్డికి అందచేసారు.

మరో వైపు ప్రభుత్వం కూడా మహా పాదయాత్ర నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే తెరపైకి తీసుకొచ్చిన అమరావతి పురపాలక సంఘం ఏర్పాటు ప్రతిపాదన పై గ్రామసభలు పెట్టడాన్ని పరిరక్షణ సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. పాదయాత్ర ప్రారంభం, సాగే గ్రామాల్లో అదే సమయాల్లో గ్రామసభలు పెట్టడం ఎంతవరకు సబబని, ఇది కేవలం పాదయాత్రను అడ్డుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యగా ఖండిస్తున్నారు. 29 గ్రామాలతో కూడిన బృహత్తర ప్రణాళిక ప్రకారం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ది చేయడం మా అభిమతమని ఇప్పటికే చెప్పామని, కొత్తగా తెరపైకి మరో ప్రతిపాదనను తీసుకొనిరావడం వెనుక ఉద్దేశం ఏంటిన రాజధాని ప్రాంతవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కుప్పంలో మాజీ సిఎం చంద్రబాబు పర్యటనలో పెను వివాదాన్ని సృష్టించిన అధికార పార్టీ నేతలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు మహా పాదయాత్ర సజావుగా సాగేందుకు ప్రత్యేక దృష్టిని సారిస్తారో, లేదా యధా రాజ తధా ప్రజా అంటూ పోలీసు ప్రభుత్వమని మరో పర్యాయం నిరూపిస్తారో పాదయాత్ర 2 ప్రారంభం అనంతరం బయటపడనుంది.

Exit mobile version